బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముమ్మర ఏర్పాట్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 3 June 2022

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముమ్మర ఏర్పాట్లు


జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లోని  హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణ బీజేపీ కార్యవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.ఈ సమావేశాలను బీజేపీ తెలంగాణ కార్యవర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం 30 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రొటోకాల్, ఆహ్వాన, స్వాగత, ఆహార, నగర సుందరీకరణ, రవాణా, మీడియా సహా మొత్తం 30 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల పనితీరును జాతీయ నేత అరవింద్ మీనన్ పర్యవేక్షిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్డు షో కోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీజేపీ కీలక స్థాయి నేతలు వస్తుండటంతో వాళ్ల సమయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ప్రతి క్రియాశీలక కార్యకర్తను ఈ సమావేశాల్లో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర నేతలకు జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్ దిశా నిర్దేశం చేశారు.

No comments:

Post a Comment