40 ఏళ్ల తర్వాత గుండె ఫిట్‌గా ఉండాలంటే. ..!

Telugu Lo Computer
0


నలభై ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. శరీరం క్షీణించడం ప్రారంభించడం మొదలవుతుంది. అందుకే ఈ వయసులో కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేయాలి. మహిళల్లో మాదిరి 40 ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కానీ చాలా మంది వీటిని విస్మరిస్తారు. అధిక బీపీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం టిఫిన్‌ చేస్తారు. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే నలభై సంవత్సరాలు దాటిన వారు పాల ఉత్పత్తుల మొత్తాన్ని తగ్గించడం మంచిది. ఎందుకంటే ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. పండ్లు, కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వ్యాధితో పోరాడడంలో సహాయపడే పోషకాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. కాబట్టి 40 ఏళ్ల తర్వాత పురుషులు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనంలో పండ్లు, కూరగాయలని చేర్చుకోవాలి. స్నాక్స్‌లో గింజలు, మొలకలు ఎక్కువగా తీసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత పురుషులు పకోడి, బజ్జీలు లాంటి ఆయిల్‌ ఫుడ్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ఊబకాయం, అసిడిటీ ఏర్పడుతుంది. అందువల్ల స్నాక్స్‌లో గింజలు, మొలకలను చేర్చితే మంచిది. రాత్రి భోజనంలో అధిక ప్రొటీన్లు ఉండే విధంగా చూసుకోవాలి. పప్పులు, పండ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలి. శాఖాహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్‌ చేయాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)