వన్డే, టీ20 సిరీస్‌ల షెడ్యూల్

Telugu Lo Computer
0


జూన్ 9నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఒకే టెస్టు కోసం ఇంగ్లాండ్‌కు టీమిండియా వెళ్లనుంది. జులై 1నుంచి ఈ టెస్టు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ఇంగ్లాండ్ టూర్ జులై 17న ముగుస్తుంది. అనంతరం టీమిండియా జులై 22న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్తుంది. అనంతరం 5టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 7న ముగియనుంది. ఈ సిరీస్‌లన్నీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2022కి ముందు అవసరమైన ప్రాక్టీస్ గేమ్‌లుగా పనిచేస్తాయి. అలాగే జట్లు కూడా తమ అత్యుత్తమ కాంబినేషన్లు ఏర్పరుచుకోవడానికి వీలు కలుగుతుంది. వెస్టిండీస్ క్రికెట్ సీఈవో జానీ గ్రేవ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ హోమ్ షెడ్యూల్‌ను ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నాడు. కరేబియన్‌లోని వివిధ ప్రాంతాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని, అభిమానులు మద్దతివ్వాలని కోరాడు. అన్ని ప్రాంతాలలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జులై 22: మొదటి వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్. జూలై 24: రెండో వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్. జూలై 27: మూడో వన్డే మ్యాచ్ - క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్. వెస్టిండీస్ స్థానిక కాలమానం ప్రకారం.. 9:30amకు వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇండియా కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు ప్రారంభమవుతాయి. జూలై 29: మొదటి టీ20 మ్యాచ్ - బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్. ఆగస్టు 1: 2వ టీ20 మ్యాచ్ - వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్. ఆగస్టు 2: 3వ టీ20 మ్యాచ్ - వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్. ఆగస్టు 6: 4వ T20 మ్యాచ్ - బ్రోవార్డ్ కౌంటీ క్రికెట్ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా, USA. ఆగస్టు 7: 5వ టీ20 మ్యాచ్ - బ్రోవార్డ్ కౌంటీ క్రికెట్ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా, USA. వెస్టిండీస్ స్థానిక కాలమానం ప్రకారం.. 10:30 amకు జమైకా కాలమానం ప్రకారం 9:30amకు మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. ఇక భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)