అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 24న రైతు సంఘాల ఆందోళన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 June 2022

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 24న రైతు సంఘాల ఆందోళన


త్రివిధ దళాల్లో సాయుధ బలగాల నియామకం కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరుద్యోగులతోపాటు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పథకానికి నిరసనగా సోమవారం భారత్ బంద్ కూడా నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ రైతు సంఘాల ప్రతినిధులు కూడా స్పందించాయి.  ఈ నెల 24వ తేదీన దేశ వ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తెలిపారు. జిల్లా, తాహసీల్దారు కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, రాకేష్ టికాయత్ సారథ్యంలోని బీకేయూ కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్త నిరసలనకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.

No comments:

Post a Comment