దేశంలో కొత్తగా 7,584 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో 3.5 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7,584 మందికి వైరస్ పాజిటివ్ తేలింది. నిన్నటి సంఖ్యతో పోల్చితే ఈ రోజు కొత్తగా నమోదైన కేసుల సంఖ్య పెరిగింది. ఫలితంగా పాజిటీవిటీ రేటు 2.26 శాతంకు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 32,498 గా ఉన్న కేసులు.. తాజాగా 36,267 (0.08శాతం)కు పెరిగాయి. 24గంటల వ్యవధిలో 24మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో భారత్ లో కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5.24 లక్షలకు చేరింది. కొవిడ్ వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. గురువారం 15.31 లక్షల మందికి టీకా వేయగా, ఇప్పటి వరకూ 194కోట్లకుపైగా డోసులు పంపిణీ చేయడం జరిగిందని కేంద్రం తెలిపింది. ఇదిలాఉంటే దేశంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 2,813, కేరళలలో 2,193 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి ఐదువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.  ఢిల్లీలో కొత్తగా 622 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)