దేశంలో 12,847 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 12,847 మందికి పాజిటివ్‌గా నిర్థారణైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతంపైనే కొనసాగుతోంది. మహారాష్ట్రలో 4,255 కేసులు, కేరళలో 3,419, ఢిల్లీలో 1,323, కర్ణాటకలో 833 కేసులు వచ్చాయి. తమిళనాడు, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 7వ తేదీన 1.92 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 15 తేదీ నాటికి 7.01 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. యాక్టివ్‌ కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 63,063కి చేరింది. మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.15 శాతానికి పెరిగింది. 7,985 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.64 శాతానికి క్షీణించింది. గత 24 గంటల్లో కరోనాతో 14 మంది మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)