భార్యను రివాల్వర్ తో కాల్చిచంపిన బీజేపీ నాయకుడు

Telugu Lo Computer
0


బీహార్ లోని ముంగేర్ జిల్లా ఓబీసీ మోర్చా విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న అరుణ్ యాదవ్ అలియాస్ అరుణ్ భయ్యా (40) బీజేపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంగేర్ నగరంలో ఓబీసీ నాయకుల్లో అరుణ్ యాదవ్ కు మంచి గుర్తింపు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అరుణ్ యాదవ్ ప్రీతి యాదవ్ అలియాస్ ప్రీతి (35)ని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అరుణ్ యాదవ్, ప్రీతి యాదవ్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. మొదటి నుంచి అరుణ్ యాదవ్, అతని ముగ్గురు సోదరులు రాజకీయాల్లో ఉంటున్నారు. భర్త అరుణ్ యాదవ్ కు తోడుగా రాజకీయాల్లో అతని భార్య ప్రతీ యాదవ్ చురుకుగా ఉంటోంది. భార్య ప్రీతి యాదవ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటంతో అరుణ్ యాదవ్ ముంగేర్ నగరంలో మంచి పలుకుబడి ఉన్న లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంగేర్ మేయర్ అభ్యర్థిగా మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. ముంగేర్ మేయర్ బీజేపీ అభ్యర్థిగా ప్రీతి యాదవ్ పేరు ఖరారు అయ్యింది. మేయర్ అభ్యర్థిగా భార్య ప్రీతి యాదవ్ ను బరిలోకి దింపిన ఆమె భర్త అరుణ్ యాదవ్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాడు. తన సోదరులు, అనుచరులతో కలిసి అరుణ్ యాదవ్ అతని భార్య ప్రతీ యాదవ్ తరుపున ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాడు. పొలం దగ్గరకు వెళ్లిన బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ కొన్ని గంటలు అక్కడే ఉన్నాడు. తరువాత అరుణ్ యాదవ్ ముంగేర్ నగరంలోని లాల్ దర్వాజా సెంటర్ లోని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పెంచుకుంటున్న సొంత గుర్రానికి గడ్డి వేసిన తరువాత అరుణ్ యాదవ్ ఓ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ భార్య ప్రీతి యాదవ్ తో గొడవపడిన అరుణ్ యాదవ్ అతని రివాల్వర్ తో ఆమెను కాల్చి చంపేశాడు. భార్య ప్రతీ యాదవ్ చనిపోయిందని నిర్దారించుకున్న బీజేపీ నాయకుడు అరుణ్ యాదవ్ అదే రివాల్వర్ తో భార్య శవం పక్కనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మేయర్ అభ్యర్థి ప్రీతి యాదవ్ ఆమె భర్త అరుణ్ యాదవ్ చేతిలో హత్యకు గురికావడం, అరుణ్ యాదవ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం ముంగేర్ నగరంలో కలకలం రేపింది. భార్య ప్రీతి యాదవ్ ను కాల్చి చంపేసిన అరుణ్ యాదవ్ అతను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన రివాల్వర్ కు లైసెన్స్ ఉందని, కేసు విచారణలో ఉందని సీనియర్ పోలీసు అధికారి కే. పాండే స్థానిక మీడియాకు చెప్పారు. ఎన్నికల ప్రచారం చేసే విషయంలో అరుణ్ యాదవ్, ప్రీతి యాదవ్ దంపతుల మద్య గొడవ జరిగిందని, అదే ఇద్దరి ప్రాణం పోవడానికి దారితీసి ఉంటుందని పోలీసు అధికారులు, బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)