పెళ్లికొడుకు అవ్వబోతున్న ఆర్పీ

Telugu Lo Computer
0


జబర్దస్త్ షోలో ఆర్పీ ఎన్నో స్కిట్ లను చేశారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు షో కు దూరమైన తర్వాత ఆర్పీ కూడా ఆ షో ను వదిలి పెట్టేశారు. అప్పటి నుంచి కూడా అదిరింది షోలో స్కిట్ లు చేస్తున్న ఆర్పీ. ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న కామెడీ స్టార్స్ షో లో స్కిట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్పీ పెళ్లికొడుకు అవ్వబోతున్నాడు. ఆర్పీ నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్పీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీప్రసన్న. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)