ప్రభాస్ మెచ్చిన సర్కారు వారి పాట ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 13 May 2022

ప్రభాస్ మెచ్చిన సర్కారు వారి పాట ?సర్కారు వారి పాట సినిమా ప్లాప్ అంటూ ట్విట్టర్‌లో యాంటీ మహేష్ బాబు టీం వైరల్ చేస్తోంది. అదే సమయంలో మహేష్ ఫ్యాన్స్ సినిమా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. సెలబ్రిటీలు సైతం మహేష్ బాబు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమలో మహేష్ ఎలా నటించాడా ? అన్న ఆసక్తితో ఆ సినిమా చూసేందుకు పలువురు ఆశక్తి చూపిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు సినిమాపై ప్రభాస్ రివ్యూ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ హల్ చల్ చేస్తున్నాయి. డార్లింగ్ నిన్న రాత్రి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకొని మరీ సర్కారువారి పాట సినిమా చూశారని ప్రభాస్స న్నిహితులు చెబుతున్నారు. సినిమా చాలా బావుందని, మహేష్ నటన తనకు నచ్చిందని ప్రభాస్ అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ మరియు ఫైట్స్ కూడా నచ్చాయని.. వాటిని బాగా ఎంజాయ్ చేసినట్లు డార్లింగ్ చెప్పాడట.  అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఈ స్టార్ హీరోల అభిమానులు మాత్రం ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం ఆందరికి తెలిసిందే. ప్రభాస్ నటించిన 'వర్షం' ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్టుగా మహేష్ బాబు అప్పట్లో హాజరయ్యాడు. ఆ తర్వాత ఇటీవలే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించారు. ప్రస్తుతం మహేష్ సినిమాపై ప్రభాస్ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు డైరెక్టర్ పరుశురామ్.. దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి నటన అందరితో వావ్ అనిపించింది. ఇక మహేష్ కామెడీ కూడా ఆకట్టుకుంది.ఈనెల 12న సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రాన్ని జీఏంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment