"అచ్చోసిన ఆంబోతు"

Telugu Lo Computer
0

 


పల్లెటూరిలో పుట్టి పెరిగిన వారికీ ఈ సామెత బాగా విని వుంటారు. మరి ఎద్దులను ఆలా ఉదాహరణగా ఎందుకు చెప్పరు ? ఆంబోతు, ఎద్దు రెండూ పుట్టినప్పుడు కోడెదూడలే. ఆవుకే పుడతాయి. కోడెదూడలు అంటే మగవి. పెయ్యదూడలు అంటే,ఆడవి. పుట్టినప్పుడు కోడెదూడలుగా ఉన్నవాటిలో కొంత కాలం తర్వాత కొన్ని ఎద్దులు అయితే మరికొన్ని ఆంబోతులు అవుతాయి. వ్యవసాయంలో రైతుకు ఆసరాగా ఉండేవి అంటే పొలం దున్నడానికి, బండి నడపడానికి సాయం చేసేవి ఎద్దులు. ఏ కష్టం చేయకుండా చక్కగా తిని తిరిగేవి ఆంబోతులు. అందుకనే పనిపాట లేకుండా తిరిగే వారిని అలా అంటారు అన్న మాట!

Post a Comment

0Comments

Post a Comment (0)