సానుకూల దృక్పథం !

Telugu Lo Computer
0


సానుకూల దృక్పథం మనిషి జీవన గమనాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. మానవ జీవన ప్రయాణంలో ప్రతి మనిషీ ఎదో ఒక సందర్భంలో కొన్ని ఇబ్బందులను, సవాళ్ళను, సమస్యలను ఎదుర్కోవడం సహజం. అటువంటి పరిస్థితులలో ఆ మనిషి యొక్క దృక్పథం తన జీవన దిశను నిర్దేశిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను, జీవన శైలిని, చర్యలను తన సానుకూల దృక్పథం  తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  ప్రతి విజేతలో ఉండే ఒక ముఖ్య లక్షణం సానుకూల దృక్పథం. కనుక తమ జీవితంలో విజయం సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఈ గొప్ప లక్షణాన్ని అలవరచుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి. ఒక విషయంపై మనం వ్యవహరించే తీరు మనం సానుకూల దృక్పథం కలిగి ఉన్నామా లేదా ప్రతికూల దృక్పథం కలిగి ఉన్నామా అన్న విషయం తెలియచేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)