పిప్పాకు - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


పిప్పాకు ఇది పల్లెల్లో ప్రతి ఇంటి పెరట్లో దొరికే మొక్క. ఈ మొక్క ఆకులలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. పిప్పాకు రసం చాలా ఘాటైనది. పంటి నొప్పితో భాదపడే వారు ఈ ఆకు రసం తీసి దూదిలో ముంచి పంటి కింద పెట్టి, పై పంటితో నొక్కి పట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.పాము కాటుకి గురైన వారికి సైతం ఈ ఆకు పసరుతో వైద్యం చేస్తారు. దీని రసం కుడి ముక్కులో 5,6 చుక్కలు, ఎడమ చెవి లో 5, 6 చుక్కలు, ఎడమ ముక్కు లో, కుడి చెవిలో పోస్తే పాము కరిచిన వారికి బాగా పనిచేస్తుంది. 5 గ్రాములు పిప్పా కు తమలపాకులో పెట్టి నమిలి మింగితే ఆస్తమా తగ్గుతుంది. ఉదయం నిద్రలేచిన తరువాత పిప్పాకు రసం వాసనని పీల్చుకుంటే చాలా కాలంగా ఉన్న తలనొప్పి, పార్శపు నొప్పి తగ్గుతాయి. పిప్పాకు పసరులో కొద్దిగా కూరంజి వాము రసం కలిపి పిల్లలకు 3 మి. లీ. ఇస్తే కడుపులో ఏలికపాములు, నులి పురుగులు నశిస్తాయి. మరో రెండు ఆకుల కషాయం 100 మి.లీ నీటీలో కలిపి తాగిన విరోచనం అవుతుంది. పిప్పా కు, వెల్లుల్లిపాయలు, తమలపాకులు నూరి, గోరుచుట్టుపై కడితే తగ్గిపోతుంది. పిప్పాకులు. 9 మిరియాలు, కొంచెం హారతి కర్పూరం కలిపి నూరి శనగ గింజంత గోళీలు చేసి ఉదయం ఒక గోళీ, సాయంకాలం ఒక గోళీ నీటితో వేసుకుంటే కామెర్లు తగ్గుతాయి..

Post a Comment

0Comments

Post a Comment (0)