షాహీన్‌బాగ్‌ కూల్చివేతకు బుల్డోజర్లు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 9 May 2022

షాహీన్‌బాగ్‌ కూల్చివేతకు బుల్డోజర్లు


ఢిల్లీ లోని షాహీన్‌బాగ్‌  ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డీఎంసీ) చర్యలు ప్రారంభించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో షాహీన్‌బాగ్‌ నిలిచింది.ఇందులో భాగంగా నేడు ఈ ప్రాంతానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు. అయితే ఈ కూల్చివేతను అడ్డుకుంటూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో షాహీన్‌బాగ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి పంపించేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎస్‌డీఎంసీ ఇటీవల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే షాహీన్‌బాగ్ వద్ద కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల జహంగీర్‌పురి వద్ద జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని షాహీన్‌బాగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూల్చివేతల కోసం వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ఉదయం షాహీన్‌బాగ్‌కు బుల్డోజర్లు, జేసీబీలను తరలించారు. అయితే వీటిని చూసిన స్థానికులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మద్దతుదారులు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తాము ఇప్పటికే తొలగించామని, అయినా బుల్డోజర్లను పంపించిన భాజపా రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

No comments:

Post a Comment