అధికారులపైకి దూకిన చిరుత

Telugu Lo Computer
0


హర్యానాలోని బెహ్రంపూర్‌ లో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు సనోలి పోలీస్‌ స్టేషన్‌ కు సమాచారం ఇచ్చారు. దాన్ని పట్టుకునేందుకు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ జగదీప్‌ నేతృత్వంలోని పోలీసులు, ఇద్దరు ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగారు. తలో దిక్కు వెళ్లి చిరుత జాడను గుర్తించే పనిలో పడ్డారు. ఈలోగా ఆ చిరుత ఒక్కసారిగా పోలీసులపై దాడికి దిగింది. ఒక్కసారిగా చిరుత తమపై దాడి చేస్తుండటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చిరుతను కర్రలతో కొట్టారు. అయినప్పటికీ అది మరో వ్యక్తిపైకి దూకింది. ఇలా దాడి చేసుకుంటూ కొద్దిదూరం పారిపోయింది. చివరకు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్టు అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ జగదీప్‌ (ఎస్‌హెచ్‌వో) గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను పానిపట్‌ ఎస్పీ శశాంక్‌ కుమార్‌ సవాన్‌ పోస్టు చేశారు. చిరుతను బంధించే క్రమంలో పోలీసు, ఫారెస్టు అధికారులు గాయపడ్డారని ట్వీట్‌ చేశారు. వాళ్ల ధైర్యానికి హ్యాట్సప్‌ చెప్పారు. మొత్తానికి చిరుతతో పాటు అందరూ క్షేమంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌ లో ఉంది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)