ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్ సభ స్థానాలకు, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పంజాబ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భగవంత్ మాన్ సింగ్.. తాను ప్రాతినిధ్యం వహించిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ లో రెండు ఎంపీ స్థానాలైన అజంఘఢ్, రాంపూర్ లో జూన్ 23న ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచిన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్..ఆయన సహచరుడు అజంఖాన్ ఈ స్థానాలకు రాజీనామా చేశారు. ఇక ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అగర్తల, టౌన్ బోర్దోవలి, జుబరాజ్ నగర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికపై అందరి దృష్టి నెలకొంది. ఇక ఏపీలోనూ వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. మంత్రి మేకపాటి ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ఓట్ల లెక్కింపు చేపట్టి జూన్ 26న ఫలితాలు విడుదల చేయనున్నారు అధికారులు.

Post a Comment

0Comments

Post a Comment (0)