సుప్రియా సూలేపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు !

Telugu Lo Computer
0


ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకో' డంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓబీసీ రిజర్వేషన్లపై జరిగిన నిరసన కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ.. 'మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో' అంటూ సుప్రియా సులేను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో ఓబీసీ కోటా అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని..ఆ రాష్ట్ర సీఎం ఢిల్లీకి వచ్చి..అక్కడ ఎవర్నో కలిసారని, ఆ మరుసటి రెండు రోజులకు ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సుప్రీయా సూలే ఓ కార్యక్రమంలో కామెంట్ చేశారు.ఈ కామెంట్ పై మాట్లాడుతూ చంద్రకాంత్ పాటిల్ సులేపై ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీయాకు రాజకీయాలు తెలియవని, ఇంటికివెళ్లి వంట చేసుకోవాలని, సీఎంను ఎలా కలవాలో కూడా నీకు తెలియదని సుప్రీయాను ఉద్దేశిస్తూ పాటిల్ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేత చంద్రకాంత్ స్త్రీ ద్వేషి అని సుప్రీయా భర్త సదానంద సూలే తన ట్విట్టర్‌లో ఆరోపించారు. తన భార్య పట్ల తనకు గౌరవం ఉందని, ఆమె ఇంట్లో పని చేస్తుందని ఆమె బాధ్యతను ఆమె ఎప్పుడు విస్మరించలేదనీ ఆమె ఓ తల్లి అని, ఓ విజయవంతమైన రాజకీయవేత్త అని సదానంద అన్నారు. చంద్రకాంత్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని సదానంద సూలే అన్నారు. చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. సుప్రీయా సూలే వంట చేసుకోవాలని వ్యాఖ్యనించిన చంద్రకాంత్ చపాతీలు  చేయటం నేర్చుకోండి మీ భార్యకు వంటలో సహాయం చేయండి అంటూ ఎన్సీపీ వ్యాఖ్యానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)