భారీగా పెరిగిన టమోటా ధర !

Telugu Lo Computer
0


ప్రస్తుతం ఎండాకాలం కావడంతో టమోట ధరలకు రెక్కలొచ్చాయి.  ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా లావేరు మార్కెట్ పరిసరాల్లో 10 రోజుల క్రితం కిలో టమోట ధర రూ. 20గా ఉండగా, ప్రస్తుతం రూ. 60కి చేరింది. అంటే కిలో టమోట ధరపై ఏకంగా రూ. 40 పెరిగింది. దాంతో టమోటలను కొనాలంటే మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప జనాలు టమోట జోలికి పొవట్లేదు. మదనపల్లి మార్కెట్‌లోనూ టమోట ధరకు రొక్కలొచ్చాయి. వారం రోజల క్రితం కిలో టమోట ధర రూ. 30-35 ఉండగా, రంజాన్‌ సమీపిస్తున్న తరుణంలో ఆదివారం కిలో టమోటా రూ.55 పలికింది. మరోవైపు తెలంగాణలో కూడా టమోట ధరలు భారీగానే పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధర కేజీకి రూ. 30 నుంచి 40 వరకు నడుస్తోంది. ప్రస్తుతం మండు వేసవి కాబట్టి.. వేడికి పంట దిగుబడి తగ్గడంతో టమోటలకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని బహిరంగ మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)