ఇంటర్, డిగ్రీ, పీజీ ఇకపై ఉండవ్ ?

Telugu Lo Computer
0


ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమాలు ఇకపై ఉండే అవకాశం లేదు. త్వరలో వీటికి బదులుగా లెవల్‌ 4, లెవల్‌ 5, లెవల్‌ 6 అంటూ చెప్పాల్సి వస్తుంది. వివిధ విద్యార్హతలకు స్థాయిలు (లెవల్స్‌ను) నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఈ నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ ముసాయిదాను విడుదల చేసింది. వీటిలో సాంకేతిక విద్య, జనరల్‌ కోర్సులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు విడి విడిగా లెవల్స్‌ నిర్ధారించనున్నట్టు యూజీసీ తెలిపింది. దీంతో ఏ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్లినప్పుడు ఏ లెవల్‌ పూర్తిచేసిందీ చెప్తే సరిపోతుంది. ఈ ముసాయిదాపై యూజీసీ రాష్ట్రాల అభిప్రాయాలను సైతం కోరింది. క్రెడిట్స్‌ను సైతం ఖరారు చేసింది. 40 క్రెడిట్స్‌ సాధిస్తే సర్టిఫికెట్‌, 80 క్రెడిట్స్‌ సాధిస్తే డిప్లొమా, 120 క్రెడిట్స్‌ సాధిస్తే డిగ్రీని జారీచేయవచ్చని తెలిపింది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజీసీ ఈ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించి, ఉన్నత విద్యను ఏడు స్థాయిలుగా వర్గీకరించింది. గతంలో ఆరు స్థాయిలు ఉండగా, తాజాగా ఏడు స్థాయిలకు పెంచారు. గతంలో ఇప్పుడు సాధించాల్సిన క్రెడిట్స్‌ సంఖ్యలో మార్పులు చేయలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)