లోయలో పడిన బస్సు

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన బస్సు ఉత్తర మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోన భుసావల్ ననుంచి పాల్ఘర్ లోని బోయిసర్ కు వెళ్తుండగా దాదాపు 25 అడుగుల లోతు లోయలో పడింది.  శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.  గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, ఇతర అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడిన వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ ని మార్చాలని ప్రయాణికులు కండక్టర్ ను కోరినప్పటికీ పట్టించుకోలేదని వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)