హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరిక !

Telugu Lo Computer
0


ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియా సమీపంలోని తూర్పు తైమూర్ లో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం సునామీ ప్రమాదాన్ని తీసుకురావచ్చని అంచాన వేసింది. తూర్పు తైమూర్ ఇండోనిషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇండోనేషియా దాని పరిసర దేశాలు 'పసిఫిక్ రిమ్' అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. మహాసముద్రం అంచున టెక్టానిక్స్ ప్లేట్ల కదలిక నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీంతో పాటు సముద్రాల్లో ఉండే అగ్నిపర్వతాలు బద్ధలు అవుతుండటంతో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)