ప్రైవేటు సంస్థలు డీఆర్‌డీవో సదుపాయాలు ఉచితంగా వాడుకోవచ్చు !

Telugu Lo Computer
0


రక్షణ పరిశోధనశాలల్లోని ప్రభుత్వ పరీక్ష వ్యవస్థలను, సౌకర్యాలను ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకోవచ్చని రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన వెయ్యికిపైగా సాంకేతికతలను ఉచితంగా పరిశ్రమలకు బదలాయించేలా ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు. ఆదిభట్లలోని ఎరోస్పేస్‌ పార్కులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్‌కేఎం టెక్నాలజీస్‌ ఏర్పాటు చేసిన అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నారాయణమూర్తి, ఎస్‌కేఎం టెక్నాలజీ ఛైర్మన్‌ జి.ఆర్‌. సూర్యారావు, ఎండీ సరితా రాతిబండ్ల, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ అవినాష్‌ చందర్‌, మిధాని డైరెక్టర్‌ గౌరీ శంకర్‌, తెలంగాణ ప్రభుత్వ ఎరోస్పేస్‌, డిఫెన్స్‌ డైరెక్టర్‌ ప్రీవీణ్‌ పీఏ పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)