మధ్యతరగతి_మనిషి_ఆవేదన

Telugu Lo Computer
0


కష్టపడి జాబ్ చేసి...సంవత్సరం చివర నీకు మిగిలింది ఏంటి బజాజ్ ఈఎంఐ లు తప్ప !

నెలకు జీతం 40 వేలు అనుకో

ఇంటి అద్దె 6000

పాలు. 1800 1లీ 60 రూ

కరెంట్ బిల్. 1000

రైస్ 50 kg x50rs 2500

కూరగాయలు 1000

ఆయిల్..వగేరా. 3000

సండే చికెన్. 4వాx200. 800

కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000

పిల్లల ఫీజు. 2000x2 నెలకి

(LKG కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి)

(నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు)

పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి 2000 అవతాయి..

ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి...

నెలకు 4లుగురికి 4000 వేలు....

ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు....ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లు

అమ్మ వాళ్ళ ఊరు...

అత్తగారి ఊరు ప్రయాణాలు...ఖర్చులు....

ఇవన్నీ కాక....40వేల జీతం కదాఅని పెళ్ళాం వచ్చి

మంచి ఫోన్ కొను

ఏసీ కొను

ఫ్రిడ్జ్ కొను

వాషింగ్ మెషీన్ కొను

సోఫా కొను

గోల్డ్ కొను

బొక్క కొను

భూషణం కొను

అంటే ఉంటాయా.......ఏమన్నా అంటే

40వేలు జీతం ఎమ్ చేస్తావ్ అంటారు...

సరే...ఏదో అడుగుతుందిగా అని BANKకి వెళితే ....టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటాడు...

ఎమి మిగిలింది అని టాక్స్ కట్టడానికి....40వేలు అయిపోయి ...పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే....

సరే అడిగింది కదాఅని బజాజ్ లో EMI లోకొంటె మల్ల నెలనెలా వాడి గోల.. కాస్త జీతం లేటఇతే.. ఎవర్ని అడిగినా...ఇదేమాట...నేను కట్టాలి బ్రో అని

ఎలాగోలా టాక్స్ కడుతూ నెట్టుకొస్తుంటే ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి...

అయ్యా 40వేలు జీతం కదా ...

స్థలం కొన్నవా....

ఇల్లు కట్టవా అని....🤦‍♂ ..

(ఎందిరా ఈగోల....) 40వేల జీతంతో స్థలం కొనలేం...ఇల్లు కట్టలేం...

ప్రభుత్వం స్థలం ఇవ్వదు.... నేను కొనలేను..

ప్రభుత్వం డబుల్-బెడ్-రూమ్ ఇల్లు ఇవ్వదు....

నేను కట్టలేను...

40వేలు జీతంతీసుకుని నేను పీకింది ఏంది.....

జాబ్ మానేసి.....కాళీగా ఉంటే....

పైన చెప్పిన వన్నీ వస్తాయి....ఏ గోల ఉండదు.....

ఇంకొక ముఖ్య విషయం

చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొంది అన్ని ఫ్రీ గా పొంది ఇప్పుడు పరాయి దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకునే వాళ్లందరికీ ఈ పైన చెప్పినవి అన్ని దొరుకుతున్నాయి ఎంత విచిత్రమో ! ఇదండి మన దేశంలో బ్రతుకుతున్నటువంటి మధ్యతరగతి జీవి ఆవేదన ఆక్రందన !

Post a Comment

0Comments

Post a Comment (0)