ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బిజీ ఎయిర్ పోర్ట్ ఢిల్లీ

Telugu Lo Computer
0


మార్చి 2022లో రిలీజైన రిపోర్ట్‌లో ఢిల్లీ విమానాశ్రయం రెండవ అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. అఫీషియల్ ఎయిర్‌లైన్ గైడ్‌(ఓఏజీ) నివేదిక ఈ విషయాన్ని ప్రకటించింది. ర్యాంకింగ్స్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ను వెనక్కి నెట్టేసి ఢిల్లీ విమానాశ్రయం రెండవ స్థానానికి చేరింది. అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 2019లో రద్దీ ఎయిర్‌పోర్ట్ జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం 23వ స్థానంలో ఉండగా. మూడేళ్లలోనే రెండో స్థానానికి చేరటం విశేషం. మార్చి నెలలో అట్లాంటా విమానాశ్రయం నుంచి 44 లక్షల మంది, ఢిల్లీ నుంచి 36 లక్షలు, దుబాయ్ నుంచి 35 లక్షల మంది ప్రయాణం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)