నేడు డెన్మార్క్‌లో ప్రధాని మోదీ

Telugu Lo Computer
0


సోమవారం జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో సమావేశమయ్యారు. మోదీ మూడు రోజుల ఐరోపా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. అంతకుముందు బెర్లిన్ లోని ఫెడరల్ ఛాన్సెలరీ వద్దకు చేరుకున్న మోదీకి ఒలాఫ్ షోల్జ్ సాదర స్వాగతం పలికారు. బెర్లిన్ లో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్య అశాలపై చర్చలు జరిపారు. ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టెషన్ ఆరో సదస్సులో మోడీ, స్కోల్జ్ పాల్గొన్నారు. స్కోల్జ్ తో కలిసి వాణిజ్య ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత ఇండో ఫసిఫిక్ ఉండాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. రెండుదేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు నిరాటంకంగా సాగాలని, మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా ప్రమాణాలు పెంచాలని ఇరు దేశాల నేతలు చర్చించుకున్నారు. అయితే 2030 నాటికి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జర్మనీ భారత్ కు 10 బిలియన్ యూరోల సాయం ప్రకటించింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు సమావేశాల్లో పాల్గోనున్నారు. కొపెన్ హాగన్ లో డెన్మార్క్ ప్రధాని మెట్టె ప్రెడరిక్ సెన్నును మోదీ కలవనున్నారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం పలు ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కుదుర్చుకోనున్నారు. అనంతరం బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ హాజరవుతారు. అనంతరం కమ్యూనిటీ ఈవెంట్ కు, తరువాత క్వీన్ మార్గ్రెత్ తో విందులో మోదీ హాజరవుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)