గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో నాకు అర్థం కావట్లేదు ?

Telugu Lo Computer
0


బీహార్ లోని సుల్తాన్ గంజ్ లో గంగా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఇటీవల కూలింది. దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి అందజేసిన రిపోర్టు చూసి  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షాక్ అయినట్లు తెలిపారు. బలమైన గాలులు వీయడం వల్లే బ్రిడ్జ్ కూలినట్లు ఐఏఎస్ అధికారి రిపోర్ట్ ఇచ్చారన్నారు. బలమైన గాలులు వీస్తే బ్రిడ్జ్ ఎలా కూలుతుందో అర్థం కావట్లేదన్నారు. బీహార్ లో ఏప్రిల్ 29న బ్రిడ్జ్ కూలిందని దానిపై ఐఏఎస్ వివరణ షాకింగ్ గా ఉందన్నారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటివి ఎలా నమ్ముతారో అర్థం కావట్లేదన్నారు. గట్టిగా గాలి వీస్తే బ్రిడ్జ్ కూలుతుందా ? ఏదో తప్పు జరిగి ఉంటుందని  గడ్కరీ అనుమానం వ్యక్తం చేశారు. క్వాలిటీ లోపం లేకుండా తక్కువ ఖర్చుతో మన్నికైన నిర్మాణాలు చేపట్టాలన్నారు. రూ. 1710 కోట్లతో సుల్తాన్ గండ్, అగౌనీ ఘాట్ల మధ్య 3 వేల 116 మీటర్ల పొడవుతో 2014లో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)