దౌర్జన్యమే అనంతబాబు ఆయుధం !

Telugu Lo Computer
0


తప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ పుట్టించి నేరుగా ఆయన ఎస్టీ నియోజకవర్గం నుంచే పోటీచేయడానికి సిద్ధపడ్డారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా 2001లో కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డతీగల నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. ఎస్టీ సర్టిఫికెట్‌తో అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారని టీడీపీ నేతలు చెప్పారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని రంపచోడవరం నుంచి రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. అయితే ఎస్టీ కాకపోవడంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. వెంటనే వంతల రాజేశ్వరి అనే మహిళతో నామినేషన్ వేయించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాజేశ్వరి వైసీపీ తరపున గెలిచింది. కానీ ఆమె బదులు అనంతబాబే అధికారం చెలాయించేవారు. చివరికి ఆమెకు వచ్చే జీతం కూడా అతనే తీసుకునేవాడంటూ తెలుగుదేశం పార్టీనేతలు తెలిపారు. చివరికి టీడీపీ వారి అండతో అనంతబాబు కబంధ హస్తాల నుంచి బయటపడ్డానని రాజేశ్వరి గతంలోనే తెలిపారు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ రంపచోడవరం తూర్పు ఏజెన్సీలో మొత్తం అనంతబాబు హవానే కొనసాగుతోందని, ప్రస్తుత ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి కూడా పేరుకే ఎమ్మెల్యే అని, అధికారాలు మొత్తం అనంతబాబు చేతిలో ఉంటాయని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైసీపీ తరఫున కాపు కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. కొత్తపల్లి గీత అరకు ఎంపీగా ఉన్న సమయంలో ఆమెపై దాడికి ప్రయ్నత్నించడంతో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గంజాయి రవాణా వంటి చట్ట వ్యతిరేక వ్యవహారాల్లోనూ ఎమ్మెల్సీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుందని తెలుగుదేశం పార్టీ రంపచోడవరం నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా వెలుగులోకి రాని విషయాల్లో ఎన్నో ఉంటాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)