సిద్ధూ మూసేవాలా హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ

Telugu Lo Computer
0


గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై విచారణకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్‌ కమిషన్‌ను పంజాబ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మూసేవాలా తండ్రి బల్కౌర్‌ సింగ్‌ తన కుమారుడి హత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఐఎతో సహా ఏ దర్యాప్తుకైనా తన ప్రభుత్వం సహకారం అందజేస్తుందని ఆయన చెప్పారు. హంతకులను న్యాయం ముందు నిలబెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోదని ముఖ్యమంత్రి మాన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మూసేవాలా (28) ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం అతనికి భద్రతను తగ్గించిన ఒక రోజు తరువాత ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు చేసింది. ఈ దాడిలో మూసేవాలాతో బాటు ఎస్‌యువి వాహనంలో పయనిస్తున్న అతని బంధువు, స్నేహితుడు కూడా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో మూసేవాలా వెంట అతని అంగరక్షకులు లేరు. ఇద్దరు కమాండోలను రావద్దని చెప్పాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)