"వరల్డ్ క్లాస్"గా తిరుపతి రైల్వే స్టేషన్‌!

Telugu Lo Computer
0


తిరుపతిలోని రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకోనుంది. ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ కు సంబంధించి డిజైన్లను రైల్వే శాఖా మంత్రి శైష్ణవ్ విడుదల చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు స్వదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు  వస్తుంటారు. అటువంటి రైల్వే స్టేషన్ దాదాపు 25 ఏళ్లుగా  ఏ మాత్రం అభివృద్ది లేకుండా అలాగే ఉంది.  రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో తిరుపతి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా రూపు దిద్దుకోనుంది.దేశ, విదేశాల నుంచి వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఆ రద్దీకి తగ్గట్టుగా రై ల్వే స్టేషన్‌లో ఇప్పటిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలా మాత్రం కనిపించదు.తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తి కాగా ఆయా పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించడం కూడా జరిగిపోయింది. పనులు  కూడా శరవేగంగా జరిగిపోనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ల ఫొటోలను ట్విట్టర్‌లో విడుదల చేశారు. దీనికి సంబంధించిన టెండర్లన్నీ పూర్తయ్యాయని త్వరలోనే పనులు మొదలు కానున్నాయని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)