రాజ్యసభకు లక్ష్మణ్​ నామినేషన్

Telugu Lo Computer
0


బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దింపాలన్న పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు లఖ్​నవూ వెళ్లి నామినేషన్​ పత్రాలను ఎన్నికల అధికారికి లక్ష్మణ్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. నలుగురు పేర్లతో రాజ్యసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సరోయ, యూపీ నుంచి మిథిలేష్ కుమార్, కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది. ఎగువసభ స్థానానికి తెలంగాణ నుంచి లక్ష్మణ్​కు అవకాశం ఇవ్వటం పట్ల కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డకు తొలిసారి రాజ్యసభ సీటు ఇవ్వడం సంతోషం. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటిచ్చిన మోడీ, అమిత్‌షా, నడ్డాకు కృతజ్ఞతలు. లక్ష్మణ్ ఎంపీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవనుంది అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)