ఆడ పిల్లల భవిష్యత్తుకు భరోసా సుకన్య సమృద్ధి యోజన

Telugu Lo Computer
0


ఆడ పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచే లక్ష్యంతో 22 జనవరి 2015న 'సుకన్య సమృద్ధి యోజన' పొదుపు పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని వార్షిక వడ్డీ 7.6%గా ఉంది. క్యాలెండర్ నెలలోని ఐదవ రోజు ముగింపు మరియు నెలాఖరు మధ్యన అత్యల్ప బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కించబడుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో మీ ఖాతాలో వడ్డీ జమ చేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజనపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక పేరు మీద ఆమె సంరక్షకుడు (తండ్రి, తల్లి లేదా బంధువులు) తెరవవచ్చు. దేశంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవవచ్చు. అయితే ఒకే కాన్పులో కవల ఆడపిల్లలు లేదా ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో మాత్రం రెండు కంటే ఎక్కువ ఖాతాలను తెరవడానికి అవకాశం ఉంది. కనీసం రూ.250 డిపాజిట్ చేయడం ద్వారా సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ డబ్బును ఎన్ని వాయిదాలలో అయినా జమ చేయవచ్చు. లేదా ఒకేసారి కూడా కట్టుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద మినహాయింపు ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవడానికి బాలిక జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి. బాలిక సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల చిరునామా మరియు ఐడి ప్రూఫ్ అవసరం. ఈ ఖాతాను మీ దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో తెరవవచ్చు. ఈ పథకం కింద వచ్చే డబ్బును బాలికకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తీయడానికి వీల్లేదు. అలానే 18 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడపిల్ల పెళ్లి కాకుంటే 21 ఏళ్ల తరవాత డబ్బు తీసుకోవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)