టమాటా కేజీ వంద !

Telugu Lo Computer
0


టమాటా సరఫరా తగ్గడంతో దేశవ్యాప్తంగా టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100కు  చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ రూ.70కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక తెలియజేస్తుంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50-70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)