జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు

Telugu Lo Computer
0


రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి జాలోరి గేట్‌ ప్రాంతంలో జెండాలు ఎగురవేయడంపై వివాదం చెలరేగి ఇరు మతాల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా.. ఇంటర్నెట్‌ సర్వీసును నిలిపివేశారు. ఈద్‌ సందర్భంగా నమాజ్‌ కూడా పోలీసుల పర్యవేక్షణలో జరిగింది. జోధ్‌పూర్‌లో మూడు రోజుల పాటు పరుశురామ్‌ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాగా, జెండాలను ఏర్పాటు చేయడంలో ఇరు వర్గాల మధ్య వివాదం కాస్తా.. రాళ్లు రువ్వుకునేంత వరకు చేరింది. వీరిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్‌తో పాటు భాష్పవాయు ప్రయోగించారు. మంగళవారం తెల్లవారు జామున వరకు జరిగిన రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి, భద్రతలకు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)