786కున్న గొప్పదనం ఏమిటి? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 May 2022

786కున్న గొప్పదనం ఏమిటి?


మహమ్మదీయులకు పవిత్ర గ్రంధమైన 'ఖురాన్' గురించి చాలామందికి తెలుసు. అయితే వారు ఎంతో పవిత్రంగా భావించే '786' సంఖ్య గురించి చాలా మందికి తెలియదు. ముస్లిం సోదరులు ఏ పని మొదలుపెట్టిన అల్లాను తలచుకుని మొదలెడతారు. అసలు 'అల్లా' అంటేనే దయగలవాడు, కరుణించే వాడని అర్థం. ఈ నమ్మకానికి ప్రతీకతే 786. 'అబ్జాద్' అని పిలువబడే పురాతన అరబిక్ సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ సంఖ్య ఉద్భవించిందని తార్కికులు చెబుతారు. అబ్జాద్ సంఖ్యా శాస్త్రం ప్రకారం, 5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ బాషలో మొత్తం 28 అక్షరాలుంటాయని, ఆ భాషలో ఒక్కక అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం జరిగిందని, ఆవిధంగా ఇవ్వబడిన నెంబర్ల  ప్రకారం ఈ 786 పుట్టిందని వారి ప్రగాఢ విశ్వాసం. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రారంభంలో 'బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్' అని ఉంటుంది. ఈ పవిత్ర వాక్యం రాయడానికి ఉపయోగించే అక్షరాల విలువలను కలిపితే ఈ 786 అంకె వస్తుంది. ఇంతటి పవితమైన సంఖ్యకు ప్రపంచ దేశాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. 

No comments:

Post a Comment