దోపిడీ నాటకంతో భర్తను హత్య చేసిన భార్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 May 2022

దోపిడీ నాటకంతో భర్తను హత్య చేసిన భార్య


ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శంకర్‌, ఢిల్లీ రాణి దంపతులు యశ్వంత్‌పూర్‌లో ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు రక్తం మడుగుల్లో కింద పడి ఉండటాన్ని కుమారుడు చూశాడు. వెంటనే ఇంటి యజయాని వద్దకు వెళ్లి సహాయం కోరాడు. దీంతో ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే శంకర్‌ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. రాణికి అయిన గాయాలకు చికిత్స చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు శంకర్‌ హత్యపై భార్య రాణిని ఆరా తీశారు. అయితే దొంగలు ఇంట్లోకి చొరబడి కత్తితో తమపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని, తన మెడలోని గోల్డ్‌ చైన్ లాక్కొని పారిపోయారని రాణి చెప్పింది. కాగా, పోయిందన్న చైన్‌ను బట్టల్లో ఆమె దాచినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో రాణిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లోకి బలవంతంగా ఇతరులు ప్రవేశించే అవకాశం లేకపోవడంతో ఆమెపై అనుమానం మరింత పెరిగింది. చివరకు రాణి మొబైల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లోని సొంతూరులో ఒక వ్యక్తితో ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం విషయం బటయపడింది. దీంతో రాణిని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి దోపిడీ ప్లాన్‌ ప్రకారం హత్య చేసినట్లు ఒప్పకుంది. ఈ నాటకంలో భాగంగా తనకు తాను కత్తితో గాయ పరచుకున్నట్లు ఆమె చెప్పింది. దీంతో పోలీసులు రాణిని శనివారం అరెస్ట్ చేశారు. ఆమె భర్త హత్యతో ప్రమేయం ఉన్న ప్రియుడ్ని అరెస్ట్‌ చేసే పనిలో ఉన్నారు.

No comments:

Post a Comment