దేశంలో 2,288 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో నిన్న 4.84 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు, 10 మంది ప్రాణాలు కోల్పోనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,044 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 19,637.  ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా మహమ్మారి సోకగా.. అందులో 98.74 శాతం  వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మహమ్మారికి 5.24 లక్షల మంది  బలయ్యారు. ఇప్పటివరకు 1,90,50,86,706 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)