స్వర్ణక్క కూతురు దారుణహత్య - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 9 May 2022

స్వర్ణక్క కూతురు దారుణహత్య


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బోయ అక్కులప్ప భార్య మమత (35) బుధవారం ఉదయం బహిర్బూమికని ఒంటరిగా బయటకు వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతకగా గ్రామ శివారులోని చెట్ల మధ్యలో మమత పడిపోయి కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా ఆమె తలపై రాళ్లతో దాడి చేసిన ఆనవాళ్లతోపాటు దుస్తులు చెదిరిపోయి ఉన్నాయి. బండరాళ్లతో తలపై బలంగా మోదడంతో మమత అక్కడికక్కడే హతమైనట్లు తెలుస్తోంది. రక్తం మరకలతో ఉన్న రాళ్లు సైతం మృతదేహం పక్కన్నే ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఏ కోణంలో జరిగింది అన్న విషయం పై ఆరా తీస్తున్నారు. కాగా హతురాలు మమత కనగానపల్లి మండలం పాతపాళ్యం మాజీ నక్సలైట్‌ స్వర్ణక్క కూతురుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

No comments:

Post a Comment