పంజాబ్‌ లో 12 తరగతికి చెందిన 3 పుస్తకాలపై నిషేధం !

Telugu Lo Computer
0


పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిఖ్‌ చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలతో 12వ తరగతికి చెందిన 3 పుస్తకాలపై పంజాబ్‌ పాఠశాల విద్యా శాఖ నిషేధం విధించింది. ఈ పుస్తకాల రచయితలు, పబ్లిషర్‌ చర్యలు తీసుకుంటామని కూడా పంజాబ్‌ విద్యా మంత్రి గుర్మీత్‌ సింగ్‌ మీట్‌ హయర్‌ వెల్లడించారు. ఉత్తమ విద్య కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. 12వ తరగతికి చెందిన మోడ్రన్‌ ఎబిసి ఆఫ్‌ హిస్టరీ ఆఫ్‌ పంజాబ్‌ (రచయిత మాన్‌జీత్‌ సింగ్‌ సోధి), హిస్టరీ ఆఫ్‌ పంజాబ్‌ (రచయిత మహింద్రపాల్‌ కౌర్‌), హిస్టరీ ఆఫ్‌ పంజాబ్‌ (రచయిత ఎంఎస్‌ మాన్‌) అనే పుస్తకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. జలంధర్‌కు చెందిన వేరువేరు ప్రచురణ కర్తలు ఈ పుస్తకాలను ప్రచురించారు. ఒక విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిషేధం విధించినట్లు మంత్రి చెప్పారు. ఈ పుస్తకాల్లో సిక్కు చరిత్రను వక్రీకరిస్తూ వ్యాఖ్యలు ఉన్నాయని రైతు నాయకుడు బల్దేవ్‌ సింగ్‌ సిర్సా చేసిన ఫిర్యాదు మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సిక్కు చరిత్రను వక్రీకరించిన ఈ చరిత్ర పుస్తకాలను నిషేధించాలని పంజాబ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ (పిఎస్‌ఇబి) కార్యాలయం వద్ద అనేక సంస్థలు నిరసనలు కూడా చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)