బాలికకు ఆటో డ్రైవర్ వేధింపులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడుకు చెందిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకెళ్తానని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు. 5వేలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వు లేదంటే నైట్ మొత్తం నాతో గడువు అంటూ బాలికతో అసహ్యంగా ప్రవర్తించాడా ఆటో డ్రైవర్. చేతులు పట్టుకోవటంతో తప్పించుకుని పారిపోయింది ఆ మైనర్ బాలిక. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిందా బాలిక. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసి సెక్షన్ 363 ,354, IPC 506, పొక్సో యాక్ట్ నమోదు చేశారు. ఫేస్ బుక్ ప్రియుడు ఆంజనేయులును కలిసేందుకు స్నేహితులతో ఆ బాలిక విజయవాడ వచ్చింది. ప్రియుడు, స్నేహితులతో కలిసి దుర్గమ్మను దర్శించుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఇంట్లో పెళ్లి చేస్తా అనటంతో మళ్ళీ ప్రియుడి కోసం వచ్చేసిందా బాలిక. ఆంజనేయులు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడిని వెతుకుతూ ఆటో ఎక్కింది. మొత్తం తిప్పి రాత్రవ్వటంతో మా ఇంటికి రా రేపు వెళ్ళిపోవచ్చు అంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు ఆటో డ్రైవర్. డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే నాతో గడువు అంటూ పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడు. బాలిక ఎలాగోలా తప్పించుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)