రేషన్‌ కార్డు నిబంధనల్లో త్వరలో మార్పులు ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 April 2022

రేషన్‌ కార్డు నిబంధనల్లో త్వరలో మార్పులు ?


కరోనా లాక్‌డౌన్ తర్వాత పేద ప్రజలను ఆదుకోవడం కోసం వారి జీవనోపాధికి ఆసరాగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే  20202 మార్చి  26 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM-GKY కింద రూ.2.76 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వం  ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇదే విధమైన రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఆహార, ప్రజా పంపిణీలో ప్రస్తుతం రేషన్‌ కార్డు నిబంధనలలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది మోడీ సర్కార్‌. రేషన్‌ కార్డు అర్హత, మార్పులపై రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. రేషన్‌ కార్డు కోసం కొన్ని ప్రమాణాలు మార్పులు చేయనుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే డేటా ప్రకారం.. ప్రస్తుతం 80 కోట్ల మందికిపైగా ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే ఆర్థికంగా స్థిరంగా  కొందరు ఉన్నారని, అయినప్పటికీ వారు ఉచిత రేషన్‌ పథకాన్ని ఉపయోగిస్తున్నారని నివేదికలు వెల్లడవుతున్నాయి. దీనిని ధృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని దృష్టిలో ఉంచుకుని ‘ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డు’ను ప్రారంభించింది. అయితే మునుపటిలా కాకుండా ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రేషన్‌ కార్డును కలిగినవున్న ఎవరైనా దేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా ఉచితంగా రేషన్‌ పొందవచ్చు. ఇంతకు ముందు రేషన్‌ కార్డుదారుని సొంత రాష్ట్రంలో మాత్రమే రేషన్‌ పొందేందుకు అర్హత ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పొందే వెసులుబాటు ఉంది.

No comments:

Post a Comment