ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటాను ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 April 2022

ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటాను !


కేబినెట్లోకి కొత్త మంత్రులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో సెక్రటేరియట్లోని మంత్రుల పేషీల్లో సందడి నెలకొంది. మంత్రిగా చివరి రోజు కావడంతో రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో గెట్ టు గెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తు పెట్టుకుంటానని తనకు నాకు మీడియా చేసిన సహాయం అమోఘమని అభిప్రాయపడ్డారు. ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత  దగ్గరయ్యారన్నారు. మంత్రి గా అవకాశం ఇచ్చిన జగన్ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేని భావోద్వేగానికి గురయ్యారు. పేర్ని నాని ఇచ్చిన విందులో మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పలు చానళ్లు, పత్రికలకు సంబంధించిన మీడియా ప్రతినిథులను పేర్ని నాని పేరు పేరునా పలుకరించారు. అనంతరం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. తన మంత్రి పదవి గురించి ముందుగానే పేర్ని నాని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రవాణా శాఖకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్న ఆయన కొత్త మంత్రికి అన్ని విధాలుగా సహకరిస్తానని.. అవసరమైన సీఎంతో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఇక చివరి కేబినెట్ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులు రాజీనామాలు చేయనున్నారు. 

No comments:

Post a Comment