నేను హీరో విజయ్‌కు పెద్ద ఫ్యాన్

Telugu Lo Computer
0


బాలీవుడ్ హీరోల్లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఎనలేని పేరును సంపాదించుకున్న హీరోల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఈ హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ను సృష్టించాయి. ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాల వైపు అడుగులేస్తూ సినిమాల విషయంలో స్లో అయ్యాడు. ఈ బాలీవుడ్ బాద్‌షా తన తరువాతి సినిమాను తమిళ దర్శకుడు అట్లీతో ప్లాన్ చేసుకున్నాడు. తాజాగా ఓ తమిళ హీరోపై షారుక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమిళ హీరో విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అప్‌కమింగ్ మూవీ 'బీస్ట్' కోసం దేశవ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవల విడుదలయిన బీస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు షారుక్ ఖాన్. 'నాలాగే యాక్టర్ విజయ్‌కు పెద్ద ఫ్యాన్ అయిన అట్లీతో పనిచేస్తు్న్నాను. బీస్ట్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది' అని విజయ్‌ను, బీస్ట్ ట్రైలర్‌ను ప్రశంసలతో ముంచేశాడు షారుక్. ఒక తమిళ హీరోకు తాను పెద్ద ఫ్యాన్ అంటూ షారుక్ వేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతోంది. ఇక బీస్ట్ సినిమా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)