న్యూ లుక్‌లో పవన్ కల్యాణ్

Telugu Lo Computer
0


క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాను చేస్తున్నాడు. హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది, ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఈ చిత్రం, ఏప్రిల్ 8 నుంచి మిగతా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ కోసం టీమ్ భారీ సెట్టింగ్ సిద్ధం చేశారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)