సెర్చ్‌ ఆపరేషన్‌లో ఆయుధాల పట్టివేత

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీర్‌లో కుప్వారా పోలీసులు భారత సైన్యంతో కలిసి సోమవారం పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 54 పిస్టల్ రౌండ్లు, 17 పిస్టల్ మ్యాగజైన్లు, 10 పిస్టల్స్‌తో పాటు ఐదు గ్రనేడ్లు ఉన్నాయి. హజామ్‌ మొహల్లా, తాడ్‌కర్నాలలో జరిపిన సెర్చ్‌ ఆపరేషన్‌లో ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో భారీగా ఆయుధాల సరఫరా జరుగుతోందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో సోదాలను ముమ్మరం చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసు దర్యాప్తులో ఈడీ మార్చి 24న జమ్మూ కశ్మీర్‌లోని పలువురు ప్రస్తుత, మాజీ అధికారులు, ఆయుధ డీలర్ల ఇళ్లపై సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో పలు 'నేరారోపణ' పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవి జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ అధికారులకు, ఆయుధాల డీలర్లకు మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)