ముమ్మాటికీ అన్యాయం జరిగింది : గొల్ల బాబూరావు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 April 2022

ముమ్మాటికీ అన్యాయం జరిగింది : గొల్ల బాబూరావు


ఆంద్ధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ కేబినెట్‌లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని, తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత అహింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్ అయ్యాయని గొల్ల బాబూరావు వెల్లడించారు. అయితే ఇప్పుడు హింసావాదిగా మారతానని, తాను నూటికి లక్ష పర్సంటేజ్ హింసావాదినే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హింసావాదిగా మారతానని చేసిన వ్యాఖ్యలపై మీడియాలో నెగిటివ్‌గా ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అలర్ట్ అయ్యారు. క్లారిటీ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. తన ఆలోచనలకు కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. అధిష్టానంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న మాట నిజమేనన్నారు. ఈ విషయంపై చర్చించడానికి సీఎం పిలిస్తే వెళ్తానని, పిలవకుండా ఎందుకు వెళ్తానని ఆయన ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాలేదన్న విషయంలో కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారని.. ఈ విషయం సీఎంకు కూడా తెలియాలన్నారు.

No comments:

Post a Comment