మండుటెండలో కూడా నీళ్లు దుముకుతున్నాయి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని  సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో నూతనంగా నిర్మించిన పట్టాభి రామ దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  చింతమడక పట్టాభి రాముడి ప్రతిష్టా మహోత్సవం, రాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు గ్రామ పునర్నిర్మాణంతో పాటు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసుకున్నాం. శ్రీరాముడి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. రాష్ట్రంలో యాదాద్రి ఆలయంతో పాటు అనేక దేవాలయాలను పునర్మించుకుంటున్నాం. గత చరిత్రలో దేవాలయాల నిధులు ప్రభుత్వాలు ఉపయోగించాయి. తెలంగాణ ప్రభుత్వ నిధులే దేవాలయాలకు ఖర్చు చేస్తుంది. సీఎం కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ ఏ కార్యక్రమం చేపట్టినా దేవుడికి పూజ చేస్తారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు కోనాయపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయల్దేరారు. ఉద్యమం ఫలించింది. రాష్ట్రం సిద్ధించింది. దేవుని ఆశీస్సులతో ఏప్రిల్ నెలలో, మండుటెండలో కూడా నీళ్లు దుముకుతున్నాయి. విస్తారంగా పంటలు పండుతున్నాయని, ఒకప్పుడు నీటి కొరత తీవ్రంగా వుండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తోందన్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)