డాక్టర్ పట్టా పొందిన ఆలీ కుమారై

Telugu Lo Computer
0


టాలీవుడ్ నటుడు, స్టార్ కమెడియన్ ఆలీ పెద్ద కుమారై ఫాతిమా తన డాక్టర్ చదువుని పూర్తి చేసి పట్టా అందుకుంది. దాదాపు వెయ్యి చిత్రాల్లో అలీ నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అలీ చెరగని ముద్ర వేశారు. ఇప్పటికి నటుడిగా కొనసాగుతూ టీవీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలీ. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగితేలుతోంది. ఆలీకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. అలీ పెద్ద కుమార్తె ఫాతిమా తాజాగా తన డాక్టర్ చదువుని పూర్తి చేసి పట్టా అందుకుంది.  తన కుమార్తె డాక్టర్ కావాలనేది అలీ కోరిక అట. తండ్రి కలని నెరవేరుస్తూ ఆమె డాక్టర్ కావడంతో వారి ఫ్యామిలిలో సంతోషాలు వెళ్లి విరిస్తున్నాయి. తమ కుటుంబంలో ఫాతిమానే తొలి డాక్టర్ అని అలీ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. అలీ తన వృత్తి తో పాటు కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తారు. అలీ కుమార్తె డాక్టర్ కావడంతో నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తూ కంగ్రాట్స్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)