చైనాలో తయారైన టెస్లా కార్లు దిగుమతి చేయొద్దు !

Telugu Lo Computer
0

 

న్యూ ఢిల్లీ జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో  కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కంపెనీ భారత్‌లో సేల్స్ స్టోర్లు ఏర్పాటుకు ఆహ్వానిస్తూ, టెస్లా భారత్‌లో కార్లు తయారు చేసుకోవచ్చు. వాటిని ఎగుమతి చేసుకోవచ్చు. కానీ చైనాలో తయారైన కార్లను మాత్రం భారత్‌కు దిగుమతి చేయవద్దని షరతు విధించారు. చైనాలో తయారైన కార్లను భారత్‌లో విక్రయించడం సబబుకాదన్నారు.  భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు విక్రయించాలని ఉవ్విళ్లూరుతున్న టెస్లా ఆ కలను నెరవేర్చుకోలేకపోతోంది. ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులపై భారత్ అత్యధిక టారిఫ్‌లు విధిస్తోందని ఆరోపిస్తోంది. టారిఫ్‌లు తగ్గించమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరుపుతున్న చర్చల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో టెస్లా నిరాసక్తత వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రిక్ కార్లపై అత్యధిక టారిప్‌లు భారత్‌లోనే ఉన్నాయని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రత్యక్షంగా గతంలో ఆరోపించారు. ముందుగా దిగుమతి చేసిన కార్లను విక్రయించి భారత్‌లో అమ్మకాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటామని, ఆ తర్వాత తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని టెస్లా చెబుతోంది. అయితే పెట్టుబడుల విషయంలో స్పష్టంగా తేల్చిచెప్పకపోవడంతోనే టెస్లా ప్రతిపాదనలపై భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంలేదనే విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)