టూవీలర్ పై చిన్నారి మృతదేహంతో 90 కి.మీ ప్రయాణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా ఓ తండ్రి పడ్డ వేదన అందర్ని కలిచివేస్తోంది. చనిపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు బయట అంబులెన్స్ ను అనుమతించలేదు. తాము అడిగినంత డబ్బు ఇస్తేనే మృతదేహాన్ని తరలిస్తామంటూ రుయా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. బయట నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆస్పత్రికి అనుమతించడం లేదు. 90 కిలోమీటర్ల దూరంలోని సొంతూరుకు తీసుకెళ్లడానికి రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో.. ఆ తండ్రి అంత ఇచ్చుకోలేనని ఎంత వేడుకున్నా… బయట అంబులెన్స్ ను మాట్లాడుకుని మృతదేహాన్ని తరలించేందుకు ఆ తండ్రి సిద్ధపడ్డ.. రుయాలోని ఆంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. కడప జిల్లా చిల్వేలికి చెందిన ఓ చిన్నారి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్ లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రుయా ఆస్పత్రిలోని అంబులెన్స్ మాఫియా లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక కొడుకు చనిపోయాడన్న దు:ఖాన్ని దిగమింగుకుని కుమారుడి శవాన్ని భుజంపై వేసుకుని ద్విచక్ర వాహనంపై 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)