సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి : కేంద్ర హోంశాఖ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 April 2022

సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి : కేంద్ర హోంశాఖ


గృహ హింస కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై తెలంగాణ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారని, ఈ కేసు త్వరలోనే ట్రయల్స్‌కు రాబోతోందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. రఘురామరాజు ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు లేఖ రాసింది. 20 ఏళ్లపాటు కాపురం చేసిన భార్యను దారుణంగా వేధించిన అధికారికి మహిళలపై వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన 'దిశ' చట్టం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడమంటే మహిళల భద్రతను కాలరాయడమేనని రాఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులను వేధిస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆయన మామ ఏపీ హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్టు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్స్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాలు కూడా సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపైనా దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. స్పందించిన హోంశాఖ ఏపీ సీఎస్‌కు లేఖ రాస్తూ రఘురామ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, చర్యల నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది.

No comments:

Post a Comment