అగ్ని ప్రమాదంలో సజీవ దహనం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 April 2022

అగ్ని ప్రమాదంలో సజీవ దహనం


కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో రవీంద్రన్, ఉష దంపతులు ఇటీవల తమ సొంతింటి కలను నిజం చేసుకున్నారు. వీరు పేద కుటుంబానికి చెందినవారే అయినా ప్రభుత్వం సాయంతో వీరికి సొంతిల్లు నిర్మాణం పూర్తయ్యింది. అయితే ఇంట్లోకి వెళ్లిన రెండు రోజులకే అగ్ని ప్రమాదం జరగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు రవీంద్రన్, ఉష సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో వారి కూతురు శ్రీ ధన్య కూడా ఇంట్లోనే ఉంది. అయితే మంటలకు భయపడి తను గట్టిగా అరుస్తూ ఇంటిపై నుండి దూకేసింది. స్థానికులు ఇది గమనించి మంటలను అదుపుచేసి కుటుంబం మొత్తాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రవీంద్రన్, ఉష చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రీ ధన్య మాత్రం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

No comments:

Post a Comment